నిజామాబాద్ జిల్లాలో సుపారీ హత్యకు కుట్ర
నిజామాబాద్‌లో సుపారీ హత్యకు కుట్ర పన్నిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నందిపేట్ ఠాణాలో కేసు నమోదైంది. ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్న
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌లో సుపారీ హత్యకు కుట్ర పన్నిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నందిపేట్ ఠాణాలో కేసు నమోదైంది. ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్న వివరాల మేరకు.. తెరాస మండల నాయకుడు మహేందర్ భార్య సుమలత ప్రస్తుతం నందిపేట్ మండలం లక్కంపల్లి గ్రామ సర్పంచి. కొంతకాలంగా మహేందర్‌కు తెరాస నేత, గ్రామ ఉప సర్పంచి మాయపురం శ్రీనివాస్‌తో విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ సర్పంచి గండ్ర ప్రసాద్రావుతోనూ పడటం లేదు. ప్రస్తుతం ప్రసాద్‌రావు ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో ఉన్నారు. రాజకీయంగా తనకు అన్నివిధాలుగా అడ్డుపడుతున్న శ్రీనివాస్, ప్రసాద్‌రావుల హత్యకు మహేందర్ కుట్రపన్నాడు. ఇందుకోసం నందిపేట్ మండల కేంద్రంలో ఉండే అక్బర్‌ను సంప్రదించాడు. శ్రీనివాస్ కాళ్లు, చేతులు విరగొట్టడంతో పాటు ప్రసాద్‌రావును హత్య చేయాలని, అందుకు డబ్బులు చెల్లిస్తానని ఒప్పందం చేసుకొన్నాడు. అనంతరం అక్బర్.. షేక్ ఉస్మాన్‌తో పాటు మరికొందరి సాయం తీసుకొని..వారం రోజుల క్రితం హత్యకు పథకం వేశాడు. తల్వార్‌ను కూడా సమకూర్చుకున్నారు. ఈ పథకానికి సంబంధించి ఫోన్ రికార్డు సమాచారం సేకరించిన పిటిషనర్ శ్రీనివాస్..సీపీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఆయన ప్రత్యేక బృందంతో విచారణ చేయించారు. హత్యకు కుట్ర పన్నింది నిజమేనని గుర్తించి అక్బర్, ఉస్మాన్, మహేందర్‌ను ఆదివారం అదుపులోకి తీసుకొన్నారు. నందిపేట్ ఠాణాలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!