డీజీపీ ఫొటోను డీపీగా పెట్టి.. డబ్బులు గుంజుతున్న సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ మోసగాళ్లు సామాన్యులనే కాదు.. ప్రముఖులనూ వదలడం లేదు. తాజాగా ఆ మోసగాళ్లు వాట్సప్‌లో ఏకంగా డీజీపీ డీపీనే వాడి మోసగించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి

Updated : 28 Jun 2022 08:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ మోసగాళ్లు సామాన్యులనే కాదు.. ప్రముఖులనూ వదలడం లేదు. తాజాగా ఆ మోసగాళ్లు వాట్సప్‌లో ఏకంగా డీజీపీ డీపీనే వాడి మోసగించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను కొందరు వాట్సప్‌ డీపీగా ఉంచి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామని సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎస్‌) జాయింట్‌ పోలీసు కమిషనర్‌ గజరావు భూపాల్‌ సోమవారం తెలిపారు. డీజీపీ డీపీని వాడుతూ డబ్బులు పంపమని వాట్సప్‌ ద్వారా కోరుతున్నట్లు తమ దృష్టికి రావడంతో దీనిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లతో గతంలోనూ కొందరు మాయగాళ్లు ఇదే తరహా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల పేర్లు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి డబ్బు వసూలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు