కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగలు
ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్-భువనేశ్వర్ మధ్య నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) ఏసీ కోచ్‌లో సోమవారం పొగలొచ్చాయి. దీంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్లో రైలుని రెండు గంటల పాటు నిలిపారు
డోర్నకల్‌లో రెండు గంటలు నిలిచిన రైలు
డోర్నకల్, న్యూస్‌టుడే: ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్-భువనేశ్వర్ మధ్య నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) ఏసీ కోచ్‌లో సోమవారం పొగలొచ్చాయి. దీంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్లో రైలుని రెండు గంటల పాటు నిలిపారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్ దాటింది. మార్గమధ్యలోని తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్ సిబ్బంది ఒక బోగీ కింద పొగలు రావడాన్ని గమనించి అప్రమత్తం చేయడంతో ఆ తర్వాత వచ్చే మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో రైలును 7.40 నుంచి 8.10 వరకు పరీక్షించారు. తదుపరి పరీక్షల కోసమని డోర్నకల్ వరకు తీసుకుని రాగా హాట్ యాక్సిల్ (బేరింగ్ బాక్సు)లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మతులతో రైలును ముందుకు పంపడం శ్రేయస్కరం కాదని భావించి పొగలొచ్చిన బీ2 కోచ్‌ని తొలగించి అందులోని 66 మంది ప్రయాణికులను వేర్వేరు బోగీల్లో సర్దుబాటు చేశారు. ఈ కారణంగా డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు 8.30 నుంచి 10.30 వరకు నిలిచిపోయింది. పొగలు రావడానికి దారి తీసిన స్పష్టమైన కారణం ఏమిటనేది విచారణలోనే వెల్లడవుతుందని రైల్వే అధికారి ఒకరు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!