వివేకా హత్య కేసు నిందితుల బెయిలు పిటిషన్లపై తీర్పు వాయిదా

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు

Published : 29 Jun 2022 05:15 IST

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును (రిజర్వు) వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ప్రకటించారు. హత్య కేసులో నిందితులు వై.సునీల్‌యాదవ్‌(ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి(ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ5) బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం ఏ3, ఏ5 వాదనలు ముగిశాయి. ఏ2 వాదనల కోసం విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని