న్యాయమూర్తులనూ వదలని సైబర్‌ నేరగాళ్లు

న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖుల ఫోటోలను వాట్సప్‌ డీపీలుగా పెట్టుకొని ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లపై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌.. సీఐడీకి

Published : 30 Jun 2022 05:21 IST

సీఐడీకి ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్‌ జనరల్‌

ఈనాడు, అమరావతి: న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖుల ఫోటోలను వాట్సప్‌ డీపీలుగా పెట్టుకొని ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లపై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇలాంటివారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని హైకోర్టు కోరింది. ఆర్థిక సాయం కోసం సైబర్‌ నేరగాళ్లు పంపే సందేశాలను విస్మరించాలంది. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు సర్క్యులర్‌ జారీచేశారు. న్యాయమూర్తులు, న్యాయ ప్రముఖుల వాట్సప్‌ డీపీలుగా పెట్టుకున్న నేరగాళ్లు.. విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయ సిబ్బందిని ఆర్థిక సాయం అడుగుతూ మోసగించేందుకు యత్నించారు. ఇలాంటి ఘటనలు కొన్ని హైకోర్టు జడ్జీల దృష్టికి వచ్చాయి. దీంతో రిజిస్ట్రార్‌ జనరల్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు