Published : 01 Jul 2022 05:03 IST

ట్రావెల్స్‌ బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి

32 మందికి గాయాలు

బేస్తవారపేట, న్యూస్‌టుడే: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని తప్పించే క్రమంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందడంతోపాటు 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పూసలపాడు బస్టాండ్‌ సమీపంలో జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జంగా సాంబశివుడు (79) బేస్తవారపేటలోని తన కుమారుడి ఇంటి వద్ద నుంచి సొంతూరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో విజయవాడనుంచి అనంతపురం వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు సాంబశివుడిని ఢీకొని అదుపు తప్పి ఎదురుగా గోవా నుంచి ఒంగోలుకు వెళ్తున్న లారీని ఢీకొని బోల్తా పడింది. సాంబశివుడు అక్కడికక్కడే చనిపోయారు. బస్సులోని 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న వారిని జేసీబీ సాయంతో పోలీసులు బయటకు తీశారు. వారిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు, పది మందిని సమీప ప్రధాన పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోవడంతో రెండున్నర గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని