సీబీఐకి చిక్కిన రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌

దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ పి.ఆర్‌.సురేశ్‌ సీబీఐ వలకు చిక్కారు. జమ్మికుంట- ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పైవంతెన కాంట్రాక్టు ఒప్పందం పొడిగింపు కోసం రూ.5లక్షల

Published : 01 Jul 2022 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ పి.ఆర్‌.సురేశ్‌ సీబీఐ వలకు చిక్కారు. జమ్మికుంట- ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పైవంతెన కాంట్రాక్టు ఒప్పందం పొడిగింపు కోసం రూ.5లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్‌ నిర్మాణ్‌ నిలయంలో సీఈగా పనిచేస్తున్న ఆయన్ని బుధవారమే పట్టుకున్న సీబీఐ.. గురువారం రాత్రి దాకా నాచారంలోని ఆయన ఇంట్లో సోదాలు చేసింది. అక్కడి నుంచి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌ సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని