Published : 02 Jul 2022 05:20 IST

ఐటీసీ కుంభకోణంలో కీలక సూత్రధారి అరెస్టు

ఈనాడు, విశాఖపట్నం: నకిలీ బిల్లులు సృష్టించి రూ.25.5 కోట్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందడానికి కారణమైన కేసులో కీలక సూత్రధారిని విజయవాడలోని డీజీజీఐ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. విశాఖ జోనల్‌ యూనిట్‌ డీజీజీఐ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ పేర్కొన్న వివరాల ప్రకారం... నిందితుడు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందేందుకు మొత్తం రూ.262 కోట్లకు నకిలీ బిల్లులు సృష్టించాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ నిందితుడు తెలుగు రాష్ట్రాల్లో 21 డొల్ల కంపెనీలను సృష్టించాడు. వాటిని ఉపయోగించుకొని లావాదేవీలు జరిగినట్లు చూపించి ఐటీసీ దక్కేలా సంక్లిష్ట వ్యవస్థలను నిర్వహించాడు. గతేడాది కూడా రూ.265 కోట్ల విలువైన నకిలీ బిల్లులను సృష్టించి రూ.31 కోట్ల ఐటీసీని అక్రమంగా దక్కించుకున్నాడని అధికారి పేర్కొన్నారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు పంపారు.

* జీఎస్టీ విధానం అందుబాటులోకి వచ్చాక 200 కేసులను నమోదు చేసి రూ.275 కోట్ల విలువైన పన్ను ఎగవేతలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రూ.200 కోట్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని