Published : 03 Jul 2022 05:39 IST

మానసిక దివ్యాంగురాలిపై నలుగురి అత్యాచారం

పోలీసుల అదుపులో నిందితులు

విశాఖపట్నం (గాజువాక), న్యూస్‌టుడే: మానసిక దివ్యాంగురాలిపై నలుగురు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన విశాఖ నగరం గాజువాక పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం వెలుగు చూసింది. పక్కింటి మహిళ ప్రోద్బలంతోనే ఈ దారుణం జరిగింది. స్థానిక సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగాజువాక కూడలిలో కూలి పనులు చేసుకునే దంపతులకు ముగ్గురు సంతానం. వీరి పెద్ద కుమార్తె (21)కు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చికిత్స అందిస్తున్నారు. యువతి తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె ఏడుస్తూ కనిపించింది. ఏమైందని ఆరా తీయగా పక్కింటి మహిళ పిలవడంతో వాళ్లింటికి వెళ్లానని, అక్కడ కొందరు తనపై అత్యాచారం చేశారని చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పక్కంటి మహిళను నిలదీయగా విశ్రాంత వీఆర్వో కె.రాము నాయుడు (66), ఎస్‌.కనకరాజు (45), వై.విశ్వనాథరావు (35), షేక్‌ జలీల్‌(40) రెండు రోజులుగా యువతిపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షలకు యువతిని కేజీహెచ్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని దిశ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ పేర్కొన్నారు. దివ్యాంగ యువతితో పక్కింటి మహిళ చనువుగా ఉంటూ తరచూ ఇంటికి పిలిపించుకునేది. తనకు పరిచయమున్న వ్యక్తులతో లైంగిక చర్యలకు పాల్పడేలా చేసి వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts