ఇద్దరు ఐటీ విభాగం ఉద్యోగుల అరెస్టు

అధికారిక పని కోసం లంచం డిమాండు చేసిన ఇద్దరు ఆదాయపన్నుశాఖ(ఐటీ) ఉద్యోగుల(సీనియర్‌ టాక్స్‌ అసిస్టెంట్లు)ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. టీడీఎస్‌ ధ్రువపత్రం జారీ

Published : 03 Jul 2022 05:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: అధికారిక పని కోసం లంచం డిమాండు చేసిన ఇద్దరు ఆదాయపన్నుశాఖ(ఐటీ) ఉద్యోగుల(సీనియర్‌ టాక్స్‌ అసిస్టెంట్లు)ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. టీడీఎస్‌ ధ్రువపత్రం జారీ చేసేందుకు ఐటీ శాఖ హైదరాబాద్‌ కార్యాలయంలో పనిచేస్తున్న వికాస్‌కుమార్‌, విశాఖపట్నంలో పనిచేస్తున్న ఎం.రవికుమార్‌లు ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం డిమాండు చేశారు.  రెండు రాష్ట్రాల్లోనూ వ్యాపారం నిర్వహిస్తున్న సదరు బాధితుడి నుంచి రూ.60 వేలు తీసుకునేందుకు వారు ఒప్పుకున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం వికాస్‌కుమార్‌ తన ఇంట్లో రూ.40వేలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. తన వాటాగా వచ్చే మిగతా రూ.20వేలను రవికుమార్‌ ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయించుకున్నాడు. దీంతో ఆయన్ను విశాఖపట్నంలో అరెస్టు చేశారు. వారిద్దరిని సీబీఐ అధికారులు స్థానిక న్యాయస్థానాల్లో హాజరుపరిచి అనంతరం జైళ్లకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని