ముగ్గురు రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో అప్పుల బాధ తాళలేక ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటల కోసం చేసిన అప్పుపై వడ్డీలు పెరగడం, అవి ఏ విధంగా

Published : 04 Jul 2022 04:59 IST

పంట నష్టపోయి... వడ్డీలు పెరిగి..

చాపాడు, దేవనకొండ, మడకశిర - న్యూస్‌టుడే: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో అప్పుల బాధ తాళలేక ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటల కోసం చేసిన అప్పుపై వడ్డీలు పెరగడం, అవి ఏ విధంగా తీర్చాలో తెలియకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై వారు బలవన్మరణానికి పాల్పడ్డారు.

* వైయస్‌ఆర్‌ జిల్లా చాపాడు మండలం కుచ్చుపాప గ్రామానికి చెందిన రైతు శీర్ల గోపాల్‌ (51) అప్పుల బాధ తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. గోపాల్‌కు రూ.25 లక్షలకుపైగా అప్పు ఉంది. దాన్ని తీర్చేందుకు స్థోమత లేక శనివారం పొద్దుపోయాక ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

* కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన బోయ అంజనయ్య (55) రెండేళ్లు మిరప, ఉల్లి పంటలు సాగు చేశారు. సరైన దిగుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రూ.8 లక్షల వరకు అప్పు ఉంది. అప్పులు ఎలా తీర్చాలో మనోవేదనతో పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

* శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం జక్కేపల్లికి చెందిన రైతు రంగస్వామికి (65) దాదాపు రూ.3 లక్షల వరకు అప్పులున్నాయి. వాటిని ఎలా తీర్చాలో అర్థంకాక మనస్థాపంతో ఆదివారం సాయంత్రం మల్బరీ షెడ్డువద్ద చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని