Published : 04 Jul 2022 05:12 IST

శంకరయ్య అపహరణ కేసు సుఖాంతం

కేసును ఛేదించిన ముంబయి పోలీసులు

పెగడపల్లి, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య(50) అపహరణ వ్యవహారం సుఖాంతమైంది. శంకరయ్యను కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి చేసినట్లు ముంబయి పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్‌ నుంచి వస్తూ ముంబయి విమానాశ్రయంలో దిగాక శంకరయ్యను గత నెల 22న దుండగులు కిడ్నాప్‌ చేయగా, బాధిత కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దాదాపు వారం పాటు గాలించారు. తమిళనాడులోని కుంభకోణం పట్టణ సమీపంలోని ఓ స్థావరంలో శంకరయ్యను బందీగా ఉంచినట్లు గుర్తించి.. శనివారం రాత్రి స్థానిక పోలీసుల సహకారంతో దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చేతుల్లో బందీగా ఉండి అస్వస్థతకు గురైన శంకరయ్యను చెన్నై నుంచి ముంబయికి విమానంలో తరలించారు. ఆయనకు పోలీసుల ఆధ్వర్యంలోనే ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అసలు శంకరయ్యను ఎందుకు కిడ్నాప్‌ చేశారు? బంగారం అక్రమ రవాణాకు వాడుకున్నారా? ఆయన వద్ద ఉన్న డబ్బులు, బంగారం దోచుకునేందుకు అపహరించారా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts