Published : 06 Jul 2022 04:58 IST

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేయడం కలకలం రేపింది. పాతబస్తీ సంతోష్‌నగర్‌ ప్రాంతంలో మునావర్‌హుస్సేన్‌ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బిహార్‌వాసి అయిన ఇతడిని సోమవారమే అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నా మంగళవారం విషయం వెలుగుచూసింది. మతవిద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవలే రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్య, మహారాష్ట్ర అమరావతిలో కెమిస్ట్‌ ఉమేష్‌ల దారుణహత్యల కేసుల దర్యాప్తు క్రమంలోనే ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ ఘటనల విషయంలో సామాజిక మాధ్యమాల్లో హుస్సేన్‌ పోస్టులు పెట్టిన నేపథ్యంలో విచారించేందుకు అతడిని పట్టుకెళ్లినట్లు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని