పశు సంవర్ధకశాఖ ఏడీ ఆత్మహత్య

పుట్టపర్తి పశు సంవర్ధకశాఖ ఏడీ రాము అనంతపురంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతిథి గృహంలో మంగళవారం ఆయన విగతజీవిగా కనిపించారు. పోలీసులు,

Published : 06 Jul 2022 05:44 IST

నమ్మకస్తులు మోసం చేశారనే..!

అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే: పుట్టపర్తి పశు సంవర్ధకశాఖ ఏడీ రాము అనంతపురంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతిథి గృహంలో మంగళవారం ఆయన విగతజీవిగా కనిపించారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన రాము 6 నెలల కిందట డిప్యుటేషన్‌పై డీఆర్‌డీఏ కార్యాలయంలో డీపీఎంగా బదిలీ అయ్యారు. పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ఉన్న అతిథి గృహంలో ఉంటున్నారు. మంగళవారం గది తలుపులు తెరిచి ఉండటంతో సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా ఏడీ ఉరి వేసుకుని కనిపించారు. ఆయన భార్య రాణి కర్నూలు పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. వారికి కుమార్తె ఉన్నారు. కుటుంబం కర్నూలులోనే ఉంటోంది. రాము శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, పుట్టపర్తిలలో సుమారు ఆరేళ్లపాటు ఏడీగా పని చేశారు. పశువులకు ఏదైనా జబ్బు చేస్తే వెంటనే స్పందించి వైద్య సేవలు అందించేవారని స్థానికులు చెబుతున్నారు. ఏడీ ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు ఒక లేఖ లభించింది. నమ్మినవారే మోసం చేశారని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మవరం ప్రాంతానికి చెందిన కొందరు మోసం చేశారని ఆ లేఖలో ఏడీ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని