Hyderabad News: మెయిల్‌ హ్యాక్‌ చేసి నిర్మాణ సంస్థకు టోకరా

బంజారాహిల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థ మెయిల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.64.11 లక్షలు బదిలీ చేయించుకున్నారు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం

Updated : 07 Jul 2022 06:47 IST

రూ.64 లక్షలు బదిలీ చేయించుకున్న సైబర్‌ నేరగాళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థ మెయిల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.64.11 లక్షలు బదిలీ చేయించుకున్నారు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ నిర్మాణ సంస్థకు అవుటర్‌ హార్బర్‌ నిర్మించేందుకు ఇండియన్‌ నేవీ నుంచి కాంట్రాక్టు దక్కింది. ముడి సామగ్రితోపాటు కీలకమైన నిర్మాణాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలంటూ రెండు విదేశీ సంస్థలను కొద్దిరోజుల క్రితం నిర్మాణ సంస్థ సంప్రదించింది. లండన్‌కు చెందిన ఓ సంస్థ అందుకు ముందుకొచ్చింది.

నిర్మాణ సంస్థ కొద్దిరోజుల క్రితం రూ.64.11 లక్షలను లండన్‌ సంస్థ ఖాతాలో జమచేసింది. రెండురోజుల క్రితం లండన్‌ సంస్థ ప్రతినిధులు ఫోన్‌ చేసి మీరు ఇంకా డబ్బు పంపలేదని ప్రశ్నించారు. దీంతో తమ మెయిల్‌ హ్యాక్‌ చేసి ఎవరో డబ్బులు కాజేశారని గ్రహించిన నిర్మాణ సంస్థ ప్రతినిధులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీ కేంద్రంగా కొందరు నైజీరియన్లు హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల మెయిళ్లను హ్యాక్‌చేయడమే పనిగా పెట్టుకున్నారని.. నిర్మాణ సంస్థతోపాటు, లండన్‌ సంస్థ మెయిళ్లనూ వీరు హ్యాక్‌ చేసి డబ్బులు కాజేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని