నీట్‌లో అక్రమాలకు యత్నం.. 8 మంది అరెస్టు

వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ పరీక్షలో అక్రమాలకు యత్నించిన 8 మందిని సీబీఐ అరెస్టు చేసింది.

Published : 19 Jul 2022 06:06 IST

దిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ పరీక్షలో అక్రమాలకు యత్నించిన 8 మందిని సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ, హరియాణాలలో పరీక్ష సందర్భంగా అసలు అభ్యర్థుల స్థానంలో వీరు పరీక్ష రాసేందుకు సిద్ధపడి నేరపూరిత కట్రకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఇందుకోసం అభ్యర్థుల వివరాలు, పాస్‌వర్డ్‌లు సేకరించి వారు కోరుకున్న కేంద్రాలు ఎంపిక చేసి పరీక్ష రాసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారని సీబీఐ వెల్లడించింది. ఈ ఘటనలో మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని