16 ఫిన్‌టెక్ కంపెనీలకు ‘వజీర్ఎక్స్’ సహకారం
చైనా రుణయాప్ సంస్థల క్రిప్టో లావాదేవీల్లో ఈ కంపెనీలే కీలకం
ఈడీ దర్యాప్తులో వెల్లడి
బ్యాంకు ఖాతాల్లోని రూ.64.67 కోట్ల స్తంభన
ఈనాడు, హైదరాబాద్: చైనా రుణయాప్ సంస్థల సొమ్మును క్రిప్టో కరెన్సీల్లోకి మార్చి హవాలా మార్గంలో విదేశాలకు తరలించడంలో ముంబయి జాన్మై ల్యాబ్స్ అధీనంలోని వజీర్ఎక్స్ ఎక్ఛేంజ్ కీలకంగా వ్యవహరించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) దర్యాప్తులో వెల్లడైంది. రుణయాప్ సంస్థల లావాదేవీలకు వెన్నుదన్నుగా నిలిచిన 16 అనుమానిత ఫిన్‌టెక్ కంపెనీల లావాదేవీలకూ ఈ ఎక్ఛేంజ్ సహకారం అందించినట్లు గుర్తించింది. హైదరాబాద్‌లోని ఎక్ఛేంజ్ డైరెక్టర్ సమీర్మాత్రే కార్యాలయం, ఇళ్లలో బుధ, గురువారాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాల్ని సేకరించింది. ఎక్ఛేంజ్‌లోని సమాచారం అంతా మాత్రే కనుసన్నల్లోనే ఉన్నట్లు గుర్తించింది. ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.64.67 కోట్లను స్తంభింపజేసింది.
స్వల్ప వ్యవధి రుణాలకు భారీ వడ్డీ విధించడంతోపాటు చెల్లింపుల కోసం రుణగ్రస్థులపై తీవ్ర వేధింపులకు పాల్పడి పలువురి మరణాలకు కారణమైన చైనా రుణయాప్ సంస్థల సొమ్మును అక్రమంగా దేశం దాటించడంలో వజీర్ఎక్స్ ఎక్ఛేంజ్ సహకారం ఉందని ముందునుంచీ ఈడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగా అనుమానిత క్రిప్టో లావాదేవీల వివరాలు తెలపాలని పలుమార్లు అడిగింది. ఎక్ఛేంజ్ నిర్వాహకులు స్పందించకపోవడంతో తమ అనుమానం నిజమేనని ధ్రువీకరించుకుంది. కేమన్ ఐలాండ్ దీవుల్లోని క్రౌడ్‌ఫైర్ బైనాన్స్, సింగపూర్‌లోని జెట్టయ్ పీటీఈ లిమిటెడ్ సంస్థలతో జాన్మై ల్యాబ్స్ వెబ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు దర్యాప్తులో తేల్చింది. తమ ఎక్ఛేంజ్ క్రిప్టో-క్రిప్టో, రూపాయి-క్రిప్టో లావాదేవీల్లో క్రౌడ్‌ఫైర్ బైనాన్స్తో ఒప్పందంలో ఉందని తొలుత చెప్పిన వజీర్ఎక్స్ ఎండీ నిశ్చల్‌శెట్టి..తర్వాత మాట మార్చి కేవలం రూపాయి-కిప్ట్రో లావాదేవీలు మాత్రమే చేస్తున్నామని చెప్పడాన్ని ఈడీ తప్పుపడుతోంది. మరోవైపు లోన్ యాప్‌లకు సంబంధించి కేవైసీ నిబంధనలను ఎక్ఛేంజ్ నిర్వాహకులు అనుసరించలేదని, లావాదేవీల వివరాలను బ్లాక్ చెయిన్ టెక్నాలజీల్లో నిక్షిప్తం చేయకుండా మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల్ని ఉల్లంఘించారని నిర్ధారణకు వచ్చి దాడులను విస్తృతం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరాజ్ చోప్రా
-
World News
Trump: ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ తనిఖీలు
-
India News
India Corona: గణనీయంగా తగ్గిన కొత్త కేసులు
-
Movies News
Mahesh Babu: మహేశ్ ‘బాబు బంగారం’.. తెరపైనా, తెర వెనకా.. ఆ ప్రయాణమిదీ!
-
Politics News
Venkaiah Naidu: ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి: వెంకయ్యనాయుడు
-
Movies News
Tollywood: నిర్మాతలకు ఏ అసోసియేషన్ ఆంక్షలు పెట్టొద్దు: ప్రతాని రామకృష్ణ గౌడ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ