అవసరాల వెంకటేశ్వరరావుకు బెయిలు
బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకుని వాటిని అక్రమంగా మళ్లించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ
ఈనాడు, హైదరాబాద్: బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకుని వాటిని అక్రమంగా మళ్లించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావుకు బెయిలు మంజూరు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. తగిన పూచీకత్తులు సమర్పించి కోర్టు విచారణకు హాజరు కావడంతో పాటు పాస్‌పోర్టును జప్తు చేయాలన్న షరతులతో బెయిలివ్వాలంటూ ఈడీ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. తన బెయిలు పిటిషన్‌ను కింది కోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఎ.వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల జస్టిస్ సీహెచ్.సుమలత విచారణ చేపట్టి కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని, చట్టప్రకారం గడువులోగా దర్యాప్తు చేయని కారణంగా నిందితుడు బెయిలుకు అర్హుడని పేర్కొన్నారు. కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితుడైన ఎ.వెంకటేశ్వరరావుకు షరతులతో బెయిలు మంజూరు చేయాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!