పాతబస్తీ జ్యువెలరీ షాపులో అటవీశాఖ తనిఖీలు

అటవీ అధికారుల తనిఖీల్లో పాతబస్తీలోని ఓ జ్యువెలరీ దుకాణంలో ఏనుగు దంతాలతో చేసినవిగా భావిస్తున్న వస్తువులు దొరికాయి. కేరళ నుంచి ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు

Published : 07 Aug 2022 04:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: అటవీ అధికారుల తనిఖీల్లో పాతబస్తీలోని ఓ జ్యువెలరీ దుకాణంలో ఏనుగు దంతాలతో చేసినవిగా భావిస్తున్న వస్తువులు దొరికాయి. కేరళ నుంచి ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు హైదరాబాద్‌కు వెళుతున్నట్లు వైల్డ్‌లైఫ్‌ క్రైం కంట్రోల్‌ బ్యూరో నుంచి అందిన సమాచారంతో అటవీశాఖలోని యాంటీ పోచింగ్‌ స్క్వాడ్‌ అధికారులు శుక్రవారం చార్మినార్‌ సమీపంలోని ఓ దుకాణంలో తనిఖీలు చేశారు. ఏనుగు దంతాలతో  చేసినవిగా భావిస్తున్న కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.  ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. యాంటీ పోచింగ్‌ స్క్వాడ్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రమేశ్‌కుమార్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా, ప్రెస్‌ రిలీజ్‌ ఇస్తామని చెప్పారు కానీ శనివారం రాత్రి వరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు