Published : 07 Aug 2022 04:53 IST

కాన్పు కష్టమై తల్లీబిడ్డ మృతి

వైద్యురాలు అందుబాటులో లేక ప్రసవం చేసిన నర్సులు

మద్దూరు, న్యూస్‌టుడే: కాన్పు కష్టమై ప్రసవంలో తల్లీబిడ్డ మృతి చెందిన హృదాయవిదారక సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి(23) ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భిణి. వైద్యపరీక్షల నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం ఆశ కార్యకర్త సహకారంతో మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వైద్యురాలి సూచన మేరకు స్కానింగ్‌ తీయించడానికి వెళ్లిన సమయంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను వెంటనే ఆశ కార్యకర్త ఆసుపత్రికి తిరిగి తీసుకువచ్చారు. అప్పటికే వైద్యురాలు విధులు ముగించుకొని వెళ్లిపోయారు. స్టాఫ్‌ నర్సులు ప్రసవం చేయిస్తుండగా శిశువు మృతి చెందింది. కృష్ణవేణికి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుకవ్రారం రాత్రి మృతి చెందింది. ఈ విషయమై మద్దూరు ఆసుపత్రి వైద్యాధికారి డా.వినోదను వివరణ కోరగా.. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం కావటంతో కృష్ణవేణి మృతి చెందిందని, తమ సిబ్బంది ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదని తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని