పల్లెవనం కోసం భూమి చదును.. రైతు ఆత్మహత్యాయత్నం

తాను సాగు చేసుకుంటున్న పొలంలో (అటవీ భూమి) పల్లె వనం ఏర్పాటుకు అధికారులు చదును చేయడంపై కలత చెందిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి

Published : 08 Aug 2022 05:32 IST

కౌడిపల్లి, న్యూస్‌టుడే: తాను సాగు చేసుకుంటున్న పొలంలో (అటవీ భూమి) పల్లె వనం ఏర్పాటుకు అధికారులు చదును చేయడంపై కలత చెందిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.   శ్రీశైలం అనే రైతు దేవులపల్లిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. దానికి పక్కనే ఉన్న రెండెకరాల అటవీశాఖ భూమిని కాస్తు చేస్తూ పంటలు పండిస్తున్నారు. అందులో ఎకరం భూమిలో రూ.50 వేలు వెచ్చించి ఇటీవల మిరప మొక్కలు నాటారు. 5 నెలల కిందట ఆ భూమితో పాటు పక్కనే ఉన్న అయిదెకరాలను బృహత్‌ పల్లె ప్రకృతివనం ఏర్పాటుకు కేటాయించారు. ఈ క్రమంలో మిరప పంటను శనివారం జేసీబీతో అధికారులు తొలగిస్తుండగా రైతు అడ్డుకున్నారు. ఈ విషయమై అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారిణి కౌడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మనోవేదనకు గురైన శ్రీశైలం ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తన సమస్యను వీడియో తీసి గ్రామ వాట్సప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత గడ్డి మందు తాగారు. సమీప రైతులు, కుటుంబ సభ్యులు ఆయనను మెదక్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని