Andhra news: మహిళా హోంగార్డుకు ఆర్‌ఐ వేధింపులు?

అనంతపురం జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహిళా హోంగార్డును వేధిస్తున్నట్లు, దీనిపై బాధితురాలు ఇటీవల పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కూతురి

Updated : 09 Aug 2022 06:16 IST

గతంలో ఇలాంటి కేసులోనే రిమాండ్‌

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహిళా హోంగార్డును వేధిస్తున్నట్లు, దీనిపై బాధితురాలు ఇటీవల పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కూతురి వయసున్న ఓ హోంగార్డును రెండు వారాల కిందట ఆయన తన ఛాంబరుకు పిలిపించుకుని నీకు ఎవరెవరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. సదరు హోంగార్డు విధులు నిర్వహించే ప్రాంతానికీ వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారని తెలిసింది. మాట వినకపోతే ఉద్యోగం తీయించేస్తానని బెదిరిస్తున్నారని బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలకు వెనుకాడుతున్నారని సమాచారం. ఆ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ గతంలో కడపలో పనిచేసేటప్పుడు ఓ మహిళా హోంగార్డును వేధించిన కేసులో రిమాండ్‌కు వెళ్లొచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఆయన్ను అనంతపురానికి బదిలీ చేశారు. ఇక్కడా ఆయన తీరు మార్చుకోకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని