కిరాణా వ్యాపారి అనుమానాస్పద మృతి

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అదుపులోని వ్యక్తి మంగళవారం ఏలూరులో రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండటంపై

Published : 10 Aug 2022 03:54 IST

ఎస్‌ఈబీ కస్టడీలోని వ్యక్తి రైలు పట్టాలపై విగతజీవిగా..

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అదుపులోని వ్యక్తి మంగళవారం ఏలూరులో రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు, కొయ్యలగూడెం వ్యాపారుల కథనం ప్రకారం.. సారా వ్యాపారులకు బెల్లం విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ గత శుక్రవారం కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన కొల్లూరు దుర్గారావు(60)ను ఎస్‌ఈబీ అధికారులు అదుపులోకి తీసుకుని జంగారెడ్డిగూడేనికి తీసుకెళ్లారు. అక్కడ దుర్గారావును డ్రమ్ములు, బెల్లం పక్కన నిల్చోబెట్టి ఫొటోలు తీయించారు. అదే రోజు బంధువులు అక్కడికి వెళ్లగా కేసు నమోదైందని చెప్పి దుర్గారావును విడిచిపెట్టలేదు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం ఏలూరు సమీపంలో రైల్వేట్రాక్‌ వద్ద దుర్గారావు మృతదేహం ఉందని కుటుంబీకులకు రైల్వే పోలీసులనుంచి సమాచారం అందింది. ఎక్సైజ్‌ పోలీసుల వేధింపుల వల్లే దుర్గారావు చనిపోయారని ఆరోపిస్తూ స్థానిక వ్యాపారులు కొయ్యలగూడెం పోలీసుస్టేషన్‌ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. తన భర్త మృతికి ఎక్సైజ్‌ పోలీసులే కారణమంటూ దుర్గారావు భార్య నాగసీతామణి మంగళవారం కొయ్యలగూడెం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైందని చెప్పి తీసుకెళ్లిన తన భర్త బయటకు ఎలా వచ్చారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని