బాలుడిపై లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు

లైంగిక కోరిక తీర్చుకునేందుకు అయిదేళ్ల చిన్నారిపై పశువులా వ్యవహరించిన వ్యక్తికి జీవిత కాల జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు

Published : 11 Aug 2022 03:52 IST

పోక్సో కోర్టు సంచలన తీర్పు

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే : లైంగిక కోరిక తీర్చుకునేందుకు అయిదేళ్ల చిన్నారిపై పశువులా వ్యవహరించిన వ్యక్తికి జీవిత కాల జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి డా.రజిని బుధవారం తీర్పు చెప్పారు.  ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన అమరావతి తిరుపతిరావు(32) స్థానికంగా నివసించే ఓ బాలుడి(5)కి మాయమాటలు చెప్పి.. 2021, ఆగస్టు 22న ఓ బిల్డింగ్‌లోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేసి, హింసించాడు. అక్కడి నుంచి బాలుడు తప్పించుకుని, ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుండగా తల్లి గమనించి విచారించగా జరిగిన విషయాన్ని వివరించాడు. ఘటనపై ఆమె విజయవాడలోని దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. తిరుపతిరావును అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. పోలీసులు 30 మంది సాక్షులతో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. వీరి సాక్ష్యాన్ని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పి.పి) జి.వి.నారాయణరెడ్డి నమోదు చేయించారు. తిరుపతిరావుపై నేరారోపణ రుజువు కావడంతో.. జీవిత కాల జైలు(చనిపోయే వరకు) శిక్ష, రూ.10వేల జరిమానా, బాధిత బాలుడికి రూ.5 లక్షల నష్ట పరిహారం వచ్చే విధంగా చూడాలని జిల్లా లీగల్‌ సెల్‌ సర్వీస్‌ అథారిటీని ఆదేశిస్తూ న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని