కిరాణా వ్యాపారి మృతి కేసులో సీఐ సహా ముగ్గురు సస్పెన్షన్‌

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసుల అదుపులో ఉన్న కిరాణా వ్యాపారి కొల్లూరు దుర్గారావు మృతి కేసుకు

Published : 11 Aug 2022 03:52 IST

జంగారెడ్డిగూడెం, ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసుల అదుపులో ఉన్న కిరాణా వ్యాపారి కొల్లూరు దుర్గారావు మృతి కేసుకు సంబంధించి ఆ విభాగానికి చెందిన ముగ్గురు అధికారులపై వేటుపడింది. విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను జంగారెడ్డిగూడెం ఎస్‌ఈబీ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎ.మస్తానయ్య, సెంట్రీ డి.శ్రీహరిని సస్పెండ్‌ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ బుధవారం తెలిపారు. కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకి చెందిన వ్యాపారి దుర్గారావును ఎస్‌ఈబీ అధికారులు సారా కేసులో ఈ నెల 5న అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి ఆయన స్టేషన్‌ నుంచి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 9న ఏలూరులో రైలు పట్టాలపై ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీఐ, ఎస్‌ఐ, సెంట్రీ కానిస్టేబుల్‌ సస్పెండయ్యారు. ఈ కేసు విచారణాధికారిగా అదనపు ఎస్పీ అడ్మిన్‌ కె.చక్రవర్తిని నియమించినట్లు ఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts