అనుమానంతో ఆలినే నరికేశాడు..

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యపై అనుమానంతో కన్నపిల్లల ఎదుట విచక్షణారహితంగా కత్తితో నరికేశాడో భర్త. ఈ హృదయవిదారక సంఘటన చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు

Published : 11 Aug 2022 08:52 IST

కన్నబిడ్డల ఎదుటే తల్లిని చంపిన తండ్రి

వెదురుకుప్పం, న్యూస్‌టుడే: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యపై అనుమానంతో కన్నపిల్లల ఎదుట విచక్షణారహితంగా కత్తితో నరికేశాడో భర్త. ఈ హృదయవిదారక సంఘటన చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు ఎస్సీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కాలనీకి చెందిన గోపాల్‌ కుమారుడు సోకుకు, శ్రీరంగరాజపురం మండలం ఎగువ ముద్దికుప్పం ఎస్సీ కాలనీకి చెందిన సోమశేఖర్‌ కుమార్తె నీల(27)కు 2016లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య ప్రవర్తనపై ఇటీవల అనుమానం పెంచుకున్న అతడు.. రెండ్రోజుల కిందట గొడవకు దిగాడు. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ చేసి సర్దిచెప్పారు. బుధవారం ఉదయం మరోసారి గొడవపడ్డారు. మాటామాటా పెరిగి పిల్లలు చూస్తుండగానే భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చేతులు, మెడ, భుజం, తలపై భర్త నరికాడు. తల్లిని కొట్టొద్దంటూ తండ్రిని అడ్డుకోబోయిన చిన్నారులను సైతం నిందితుడు సోకు గాయపరిచాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రగాయాలతో కొనఊపిరితో ఉన్న నీలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం చీలాపల్లె సీఎంసీకి పోలీసులు తరలించినప్పటికీ నిష్ఫలమే అయింది. మృతురాలి తల్లి మురగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts