బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

బాలిక (14)పై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎ.శ్రీనివాసకుమార్‌

Published : 12 Aug 2022 05:24 IST

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: బాలిక (14)పై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎ.శ్రీనివాసకుమార్‌ తీర్పునిచ్చారు. నంద్యాల జిల్లా రేవనూరు ఎస్సై మహ్మద్‌ రిజ్వాన్‌ గురువారం తెలిపిన వివరాల మేరకు.. మూడేళ్ల కిందట అవుకు మండలంలోని సంగపట్నం గ్రామానికి చెందిన 65 ఏళ్ల జింకల పుల్లయ్య.. కోవెలకుంట్ల మండలం రేవనూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎం.ఉప్పులూరు గ్రామానికి వచ్చి గొర్రెలను మేపేవాడు. మనవరాలి వరుస అయిన ఓ బాలిక అతనితోపాటు గొర్రెలు మేపేందుకు వెళ్లేది. ఈ సమయంలో అతడు ఆ బాలికను లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. తర్వాత బాలిక గర్భవతిగా తేలింది. బాధితురాలి తండ్రి రేవనూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019 మార్చి 14న అప్పటి ఎస్సై రమేష్‌కుమార్‌ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని