తితిదే సూపరింటెండెంట్‌, ఐదుగురు దళారుల అరెస్ట్‌

శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయించిన తితిదే సూపరింటెండెంట్‌తో పాటు ఐదుగురు దళారులను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తిరుమల టూటౌన్‌ సీఐ

Published : 14 Aug 2022 05:21 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయించిన తితిదే సూపరింటెండెంట్‌తో పాటు ఐదుగురు దళారులను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తిరుమల టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. విశాఖపట్నంలోని తితిదే హెచ్‌డీడీపీలో ఏరియా క్లస్టర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మల్లెల మల్లికార్జున విజయవాడకు చెందిన దళారులు నోముల వెంకట మురళీకృష్ణ, తడికమల గణేష్‌ వెంకట సుబ్బారావు, ఉప్పల వంశీకృష్ణతో ముఠాగా ఏర్పడ్డారు. దళారులకు తెలిసిన ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలను తీసుకుని తితిదే సూపరింటెండెంట్‌కు అప్పగించేవారు. వాటిని హైదరాబాద్‌కు చెందిన దళారులు కంటసాని విజయకుమారి, ఆమె కుమార్తె నవ్యశ్రీ కలిసి యాత్రికులకు సుపథం, బ్రేక్‌ దర్శనం, కల్యాణమస్తు దర్శన టికెట్లు, వసతులను కల్పించి భారీగా నగదును వసూలు చేసేవారు. ఇప్పటివరకు వీరు 721 వివిధ రకాల సేవా టికెట్లు, 25 గదులు అధిక ధరలకు విక్రయించినట్లు తితిదే విజిలెన్స్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు