చెన్నై విమానాశ్రయంలో రూ.100 కోట్ల మత్తుపదార్థాల స్వాధీనం

ఇథియోపియా నుంచి చెన్నై విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చిన రూ.వంద కోట్ల విలువైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఐయూ అధికారులు తెలిపారు. వారు

Updated : 14 Aug 2022 05:51 IST

చెన్నై (ట్రిప్లికేన్‌), న్యూస్‌టుడే: ఇథియోపియా నుంచి చెన్నై విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చిన రూ.వంద కోట్ల విలువైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఐయూ అధికారులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..శనివారం ఇథియోపియా నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఇక్బాల్‌ భాషా అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. అతను తీసుకొచ్చిన చెప్పులు, లోదుస్తులు, తదితర చోట్ల దాచిన 9.59 కిలోల కొకైన్‌, హెరాయిన్‌ వంటి మత్తుపదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.వంద కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts