జెండా పండుగలో అపశ్రుతులు

జెండా పండుగ నాడు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఒకచోట విద్యుదాఘాతంతో ఇద్దరు మరణించగా, మరోచోట ప్రసంగిస్తూ గుండెపోటుతో ఒకరు తుదిశ్వాస విడిచారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో

Updated : 16 Aug 2022 06:42 IST

విద్యుదాఘాతంతో ఇద్దరు, గుండెపోటుతో ఒకరి మృతి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: జెండా పండుగ నాడు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఒకచోట విద్యుదాఘాతంతో ఇద్దరు మరణించగా, మరోచోట ప్రసంగిస్తూ గుండెపోటుతో ఒకరు తుదిశ్వాస విడిచారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో జెండా స్తంభం విద్యుత్తు తీగలకు తగిలి ఇద్దరు కన్నుమూశారు.

ఎస్సై రామునాయుడు తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ్‌ (42) పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో ఉంటూ ఏటీఎం నిర్వహణ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామం నుంచి వచ్చిన తిరుపతయ్య (42) ఏడేళ్లుగా ప్లంబర్‌గా ఇక్కడ స్థిరపడ్డారు. వీరిద్దరూ ధనుంజయ్‌తో కలిసి జాతీయజెండా ఎగురవేసేందుకు ఇనుప పైపును పైకి లేపుతుండగా పైన ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలకు తగిలింది. విద్యుదాఘాతానికి గురైన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. అనిల్‌కుమార్‌ గౌడ్‌, తిరుపతయ్యలు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ధనుంజయ్‌ పరిస్థితి బాగానే ఉందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts