జాతీయ పతాకం తొలగిస్తుండగా విద్యుదాఘాతం

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ట్యూషన్‌లో ఆవిష్కరించిన జాతీయ పతాకాన్ని తొలగిస్తుండగా ఇద్దరు పదో తరగతి విద్యార్థులు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల

Published : 17 Aug 2022 03:52 IST

ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ట్యూషన్‌లో ఆవిష్కరించిన జాతీయ పతాకాన్ని తొలగిస్తుండగా ఇద్దరు పదో తరగతి విద్యార్థులు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మేదరగేరిలో నివాసం ఉంటున్న మణికంఠ, దీపక్‌.. ఫరీసామొహల్లాలోని వెస్లీ ప్రైవేటు పాఠశాలలో నిర్వహిస్తున్న ఏ1 విజేత ట్యూషన్‌కు మంగళవారం ఉదయం వెళ్లారు. ట్యూషన్‌ ముగిసిన తర్వాత ఇద్దరు విద్యార్థులతో పాటు మరో ఇద్దరు కలిసి మేడపై ఎగరవేసిన జాతీయ పతాకాన్ని తొలగించేందుకు వెళ్లారు. జెండా కట్టిన ఇనుపరాడ్డు ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలకు తాకడంతో దీపక్‌, మణికంఠ విద్యుదాఘాతానికి గురై అక్కడే స్పృహ కోల్పోయారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు హుటాహుటిన క్షతగాత్రులను చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మూడో పట్టణ సీఐ గుణశేఖర్‌బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని