ఇద్దరి ఉసురు తీసిన విద్యుత్తు

విద్యుదాఘాతం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇంటి పెద్దల్ని బలి తీసుకుని భార్యా పిల్లల్ని రోడ్డున పడేసింది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో మంగళవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో

Published : 17 Aug 2022 03:52 IST

రెండు కుటుంబాల్లో పెను విషాదం

గుర్ల, న్యూస్‌టుడే: విద్యుదాఘాతం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇంటి పెద్దల్ని బలి తీసుకుని భార్యా పిల్లల్ని రోడ్డున పడేసింది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో మంగళవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతానికి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కెల్ల గ్రామానికి చెందిన రమేష్‌ (35) నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటర్‌ ఆన్‌ చేసేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఆయనకు భార్య బంగారమ్మ, పిల్లలు కావ్య (4), శ్రావ్య (2) ఉన్నారు. రమేష్‌ వ్యవసాయంతోపాటు తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే మండలం ఆనందపురానికి చెందిన మీసాల అప్పలనాయుడు(32)కు జగనన్న ఇల్లు మంజూరైంది. నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలను తడుపుతుండగా అక్కడ విద్యుత్తు తీగ ఉండటంతో ప్రమాదవశాత్తూ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య రాములమ్మ, ఇద్దరు ఆడపిల్లలు శ్యామల(7), హైమావతి(2) ఉన్నారు. దంపతులు కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించేవారు. భర్త మృతితో వారి రోదనలు మిన్నంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని