రేపల్లెలో ఉపాధ్యాయినిపై దాడి

బాలికను దండించిందన్న ఆగ్రహంతో ఆమె మేనమామ పాఠశాలలో ఉపాధ్యాయినిపై దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా రేపల్లెలోని ట్రిపుల్‌ ఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మునిరేడులో ప్రభుత్వ

Published : 18 Aug 2022 05:11 IST

బాలికను దండించారని మేనమామ ఆగ్రహం

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే: బాలికను దండించిందన్న ఆగ్రహంతో ఆమె మేనమామ పాఠశాలలో ఉపాధ్యాయినిపై దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా రేపల్లెలోని ట్రిపుల్‌ ఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మునిరేడులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బేతాళ మణికుమార్‌ కుమార్తె మూడో తరగతి చదువుతోంది. మంగళవారం ఉపాధ్యాయిని సుజాత తనను కొట్టిందని బాలిక తల్లిదండ్రులకు, మేనమామకు చెప్పింది. బుధవారం ఉదయం విద్యార్థి మేనమామ జెతిన్‌.. పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయినిపై చేయిచేసుకున్నారు. వాచ్‌మన్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపైనా దాడికి పాల్పడ్డారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు బాధిత ఉపాధ్యాయినికి మద్దతుగా నిలిచి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సూర్యనారాయణ తెలిపారు. తమ కుమార్తెను కొట్టిన ఉపాధ్యాయినిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని