పేర్లు చెప్పాలని బెదిరింపులు.. విదేశాల నుంచీ ఫోన్లు వస్తున్నాయి: చీకోటి ప్రవీణ్‌

తనను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన హత్యకు సుపారీ ఇచ్చామంటూ హెచ్చరిస్తున్నారని అన్నారు. విదేశాల్లో

Updated : 18 Aug 2022 10:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: తనను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన హత్యకు సుపారీ ఇచ్చామంటూ హెచ్చరిస్తున్నారని అన్నారు. విదేశాల్లో నిర్వహించిన క్యాసినోల్లో హవాలా లావాదేవీలు అవాస్తవమన్నారు. అదంతా ఈడీ విచారణలో తేలుతుందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన బెదిరింపుల గురించి చెబుతూ ‘క్యాసినో వ్యవహారంలో పేర్లు చెప్పొద్దని కాల్స్‌ వస్తాయని భావించా. కానీ పేర్లు చెప్పాలని బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. విదేశాల నుంచి వాట్సప్‌కాల్‌ వచ్చింది. లోకల్‌ నంబర్‌ నుంచి రెండుసార్లు, మరో నంబర్‌ నుంచి ఒకసారి కాల్స్‌ వచ్చాయి. హిట్‌మాన్‌ అనే సుపారీ కిల్లింగ్‌ యాప్‌ ద్వారా నన్ను చంపేందుకు సుపారీ ఇచ్చామంటున్నారు. ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పకపోతే అంతమొందిస్తామన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరపాలి. అన్ని రాజకీయపార్టీల్లో నాకు మిత్రులున్నారు. నా జన్మదిన వేడుకలకు వచ్చి వెళ్లారు. అందులో తప్పేముంది? హవాలాలో నాకే సంబంధం లేదు. అలాంటప్పుడు మంత్రులకేం సంబంధముంటుంది..’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని