Published : 19 Aug 2022 03:56 IST

దర్యాప్తు అధికారులమంటూ బ్యాంకు దోపిడీ

జంశెద్‌పుర్‌: అది బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఓ శాఖ. కస్టమర్లు కాస్త తక్కువ ఉన్న సమయంలో నలుగురు వ్యక్తులు ఒక్క ఉదుటున లోపలికి వచ్చారు. తాము దర్యాప్తు అధికారులమని, ఎవ్వరూ కదలొద్దని హెచ్చరించారు. కస్టమర్ల నుంచి మొబైల్‌ ఫోన్లు తీసుకున్నారు. బ్యాంకు ఉద్యోగులను తుపాకీతో బెదిరిస్తూ అందరినీ ఒకవైపు నుంచోబెట్టారు. ఆ తర్వాత ఎంచక్కా లక్షల సొమ్మును సంచిలో నింపుకొని. బ్యాంకు బయట తాళం వేసి ఉడాయించారు. ఝార్ఖండ్‌ జంశెద్‌పుర్‌లోని ఉలీడీహ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులు సుమారు రూ.35లక్షలు దోచుకెళ్లినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని