తితిదే టికెట్లు అధిక ధరలకు విక్రయంపై కేసు
శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు దళారులపై కేసు నమోదు చేశారు. తిరుమల విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో పద్మనాభన్ తెలిపిన వివరాల మేరకు.. భక్తుడు మోహన్గుప్తాకు ఆరు వీఐపీ బ్రేక్ దర్శనాలు, సుప్రభాత
తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు దళారులపై కేసు నమోదు చేశారు. తిరుమల విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో పద్మనాభన్ తెలిపిన వివరాల మేరకు.. భక్తుడు మోహన్గుప్తాకు ఆరు వీఐపీ బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవా టికెట్లు ఇప్పిస్తామని తిరుపతికి చెందిన దళారీ రాజు చెప్పి రూ.86,500 వసూలు చేశాడు. దర్శన టికెట్లు ఇవ్వకపోవడంతో ఆయన తితిదే విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. అలాగే బెంగళూరుకు చెందిన భక్తుడు కిరణ్‌దేశ్ పాండేకు శ్రీవారి సుప్రభాతసేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి పెనుమూరుకు చెందిన దళారి పవన్‌కుమార్‌రెడ్డి రూ.8వేలు వసూలు చేశాడు. టికెట్లు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి ఆయన ఫిర్యాదు చేశారు.
22న శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల జారీ
సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్లను ఈనెల 22న ఉదయం 9గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. సెప్టెంబరులో బ్రహ్మోత్సవ తేదీలైన 27 నుంచి 30 వరకు ఈ టోకెన్లను తితిదే రద్దు చేసింది.
* తితిదే అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను గురువారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేయగా భక్తులు బుక్ చేసుకుంటున్నారు.
తితిదేకు 11 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
ఈనాడు, అమరావతి: ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన 11 రకాల ఉత్పత్తులను ఈ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందని రైతు సాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ