హెడ్‌కానిస్టేబుల్‌ ఇంట్లో 41 బుల్లెట్లు లభ్యం

అవినీతి నిరోధక శాఖకు చిక్కిన హెడ్‌కానిస్టేబుల్‌ ఇంట్లో 41 బుల్లెట్లు లభ్యమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్‌ ఠాణాలో స్టేషన్‌ బెయిల్‌ కోసం బాధితుడి నుంచి.....

Published : 20 Aug 2022 03:48 IST

అనిశా అధికారుల సోదాల్లో గుర్తింపు

వేములవాడ, న్యూస్‌టుడే: అవినీతి నిరోధక శాఖకు చిక్కిన హెడ్‌కానిస్టేబుల్‌ ఇంట్లో 41 బుల్లెట్లు లభ్యమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్‌ ఠాణాలో స్టేషన్‌ బెయిల్‌ కోసం బాధితుడి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ హెడ్‌కానిస్టేబుల్‌ చంద్ర ప్రకాష్‌ అనిశాకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆయన ఇంట్లో గురువారం రాత్రి జరిపిన సోదాల్లో అనిశా అధికారులు 41 బుల్లెట్లు గుర్తించారు. వాటిలో 303 తుపాకీకి సంబంధించినవి 40 ఉండగా, ఇంకోటి 9 ఎం.ఎం.పిస్తోల్‌కు చెందినది. ఈ మేరకు వారు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈయన వద్ద ఇన్ని బుల్లెట్లు లభ్యం కావడం పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. అనిశా కేసు కంటే బుల్లెట్లు కలిగి ఉండటమే పెద్ద నేరంగా పేర్కొంటున్నారు. అనిశా అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ సీఐ వెంకటేష్‌ తెలిపారు. కాగా అనిశా సోదాల్లో హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రప్రకాష్‌ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు లభ్యమైనట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని