ఎన్‌ఐఏ చేతికి పీఎఫ్‌ఐ కేసు!

దేశంలో మతపరమైన దాడులకు కుట్ర కేసులో కీలక అడుగు పడింది. ఈ కేసు వివరాలు, ఆధారాలు తమకు అందజేయాలని ఎన్‌ఐఏ అధికారులు రాష్ట్ర పోలీసులకు ఇటీవల లేఖ

Published : 31 Aug 2022 04:53 IST

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: దేశంలో మతపరమైన దాడులకు కుట్ర కేసులో కీలక అడుగు పడింది. ఈ కేసు వివరాలు, ఆధారాలు తమకు అందజేయాలని ఎన్‌ఐఏ అధికారులు రాష్ట్ర పోలీసులకు ఇటీవల లేఖ రాశారు. త్వరలోనే ఓ బృందం నిజామాబాద్‌ జిల్లాకు వచ్చి విచారణ జరిపే అవకాశాలున్నాయి. పీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో.. కరాటే శిక్షణ ముసుగులో దేశంలో మతపరమైన దాడులకు కుట్రపన్నిన ఉదంతం వెలుగుచూసింది. దాడులు ఎలా చేయాలనే అంశంపై ఆటోనగర్‌ పరిధిలోని ఓ ఇంట్లో యువతకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జులై 4న కేసు నమోదు చేసి, మొదట శిక్షకుడు ఖాదర్‌ను అరెస్టు చేశారు. తర్వాత మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. మరో 24 మంది నిందితులు పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని