దస్తగిరి దంపతులను విచారించిన సీబీఐ

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి, ఆయన భార్యను సీబీఐ గురువారం పులివెందులలో విచారించింది. గత ఆరు నెలలుగా పులివెందుల వైకాపా

Published : 23 Sep 2022 04:29 IST

ఈనాడు డిజిటల్‌-కడప, న్యూస్‌టుడే-పులివెందుల: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి, ఆయన భార్యను సీబీఐ గురువారం పులివెందులలో విచారించింది. గత ఆరు నెలలుగా పులివెందుల వైకాపా నాయకుల నుంచి ఎదురైన ఇబ్బందులు, బెదిరింపులను సీబీఐ దృష్టికి దస్తగిరి తీసుకెళ్లినట్లు తెలిసింది. భార్యాభర్తలు ఇద్దరినీ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మధ్యాహ్నం రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించారు. సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ కడప నుంచి దిల్లీకి వెళ్లాక దస్తగిరికి పులివెందుల నియోజకవర్గంలోని కొందరు వైకాపా నాయకుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీనిపై దస్తగిరి ఎస్పీతో పాటు సీబీఐకి ఫిర్యాదు చేశారు. బెదిరింపుల విషయాన్ని విచారణలోనూ సీబీఐ అధికారుల దృష్టికి దస్తగిరి తీసుకెళ్లినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని