100 కిలోల వెండి ఇటుకల అక్రమ రవాణా

ఒడిశాలోని కటక్‌ జిల్లా ఆబ్కారీ అధికారులు గురువారం గంజాయి కోసం వాహనాలను తనిఖీ చేస్తుండగా 100 కిలోల వెండి ఇటుకలు, ఆభరణాలు, రూ.14 లక్షల నగదు లభ్యమయ్యాయి. గంజాం జిల్లాలోని అస్కా ప్రాంతం నుంచి

Published : 23 Sep 2022 04:29 IST

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని కటక్‌ జిల్లా ఆబ్కారీ అధికారులు గురువారం గంజాయి కోసం వాహనాలను తనిఖీ చేస్తుండగా 100 కిలోల వెండి ఇటుకలు, ఆభరణాలు, రూ.14 లక్షల నగదు లభ్యమయ్యాయి. గంజాం జిల్లాలోని అస్కా ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్నారని తెలుసుకున్న అధికారులు 16వ నంబరు జాతీయ రహదారిపై కటక్‌ సమీపంలోని టంగి టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన కారులో సీటు కింద రహస్య అరలో వెండి ఇటుకలు, నగలు, నగదు గుర్తించారు. పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన నగల వ్యాపారి దిలీప్‌ మండల్‌, డ్రైవరు అతాను పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెండి ఇటుకలు పసుపురంగు ఉండటంతో వాటిపై బంగారు పూత పూసినట్లు అనుమానిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని