నగ్నంగా ఇంటికి వెళ్లిన అత్యాచార బాధితురాలు.. సామాజిక మాధ్యమాల్లో వీడియో

పదిహేనేళ్ల బాలిక పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు ఐదుగురు కామాంధులు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో సెప్టెంబరు 1న జరిగిందీ దారుణం. ఆమె నగ్నంగా నడుచుకుంటూ

Updated : 23 Sep 2022 06:23 IST

పదిహేనేళ్ల బాలిక పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు ఐదుగురు కామాంధులు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో సెప్టెంబరు 1న జరిగిందీ దారుణం. ఆమె నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న వీడియోను ఓ మహిళ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అనేక రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి వయసు 15 ఏళ్లు. సెప్టెంబరు 1న పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్లింది. తిరిగి వస్తుండగా నితిన్‌, కపిల్‌, అజయ్‌, నాజియా అలీ, ఇమ్రాన్‌ కలిసి.. బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. అనంతరం వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమీపంలోని పొలాల్లో పని చేసుకుంటున్నవారు.. బాధితురాలి అరుపులు విని, అటు వైపు వచ్చారు. వెంటనే నిందితులంతా పారిపోయారు. బాధితురాలు అలానే నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లి.. కుటుంబసభ్యులకు జరిగినదంతా చెప్పింది. బాలిక నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్‌ కాగా.. పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. అయితే.. ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాధితురాలు, కుటుంబం కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని కొందరు చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మొరాదాబాద్‌ ఎస్‌పీ(గ్రామీణ) సందీప్‌ కుమార్‌ మీనా దీనిపై వివరణ ఇచ్చారు. ‘‘తన మేనకోడలిపై అత్యాచారం జరిగిందని ఓ వ్యక్తి సెప్టెంబరు 7న ఫిర్యాదు చేశాడు. మేము దర్యాప్తు ప్రారంభించాం. కానీ.. అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. అయినా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఒక నిందితుడ్ని అరెస్టు చేశాం’’ అని స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని