TSRTC Driver: అధికారులు వేధిస్తున్నారని ఆర్టీసీ డ్రైవర్‌ బలవన్మరణం

చేవెళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ పొద్దటూరు అశోక్‌ (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముంద]ు ఆయన భార్య కూలి పనికి నడిచి వెళ్లేందుకు సిద్ధమవగా..

Updated : 25 Sep 2022 10:05 IST

చేవెళ్ల గ్రామీణం: చేవెళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ పొద్దటూరు అశోక్‌ (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముంద]ు ఆయన భార్య కూలి పనికి నడిచి వెళ్లేందుకు సిద్ధమవగా.. పొలం వద్ద బండిపై దింపి వచ్చారు. కొద్ది సేపటికే.. ‘ఉరి వేసుకుంటున్నా.. పిల్లలు జాగ్రత్త’ అంటూ భార్యకు ఫోన్‌ చేసి పెట్టేశారు. తక్షణం ఆమె బయలుదేరి ఇంటికి వచ్చేసరికే ఉరికి వేలాడుతూ కనిపించారు. చేవెళ్ల పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్‌ కొన్ని రోజులుగా కార్గో బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన నడుపుతున్న బస్సుకు డ్యామేజి కావడంతో అధికారులు డ్రైవర్‌ విధులు తొలగించి రాత్రి పూట డిపో వద్ద పార్కింగ్‌ పని అప్పగించారు. పగలు విధులు ఇవ్వాలంటే బస్సు డ్యామేజికి పెనాలిటీ మొత్తం చెల్లించాలని అధికారులు వేధిస్తున్నారని అశోక్‌ ఆయన భార్య లావణ్య వద్ద వాపోయారు. దీంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

వేధించామనడం అవాస్తవం..
‘‘అశోక్‌ ఈ నెల 21న విధులు నిర్వహించి ఇంటికి వెళ్లారు. 22న వారాంతపు సెలవు కావడంతో రాలేదు. బస్సు డ్యామేజి అయిందని తెలిసి 23న పార్కింగ్‌ వద్ద రాత్రి డ్యూటీ వేశాం. వేధింపులకు గురిచేశామనడం అవాస్తవం’’ అని మెహిదీపట్నం డిపో మేనేజర్‌ సూర్యనారాయణ చెప్పారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts