పొలంలో విద్యుత్తు కంచెకు విద్యార్థి బలి

చదువుకుంటూనే సాగు పనుల్లో కుటుంబసభ్యులకు ఆసరాగా నిలుస్తున్న ఓ విద్యార్థి జీవితం పంట రక్షణకు అమర్చిన విద్యుత్తు తీగలకు బలైపోయింది. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌

Published : 25 Sep 2022 04:51 IST

తొలుత విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

బండి బోల్తాపడడంతో.. బాలుడు సైతం

దిలావర్‌పూర్‌, న్యూస్‌టుడే: చదువుకుంటూనే సాగు పనుల్లో కుటుంబసభ్యులకు ఆసరాగా నిలుస్తున్న ఓ విద్యార్థి జీవితం పంట రక్షణకు అమర్చిన విద్యుత్తు తీగలకు బలైపోయింది. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కదిలి గ్రామంలో శనివారం పదో తరగతి విద్యార్థి, దివ్యాంగుడైన చంద్రకాంత్‌(15) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కదిలికి చెందిన గంగాధర్‌- గంగూబాయిల రెండో కుమారుడైన చంద్రకాంత్‌ దిలావర్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఎడ్ల బండిని చేనులోకి తీసుకు వెళ్తుండగా.. దారిలో ఇతర రైతులు పంట రక్షణకు అమర్చిన విద్యుత్తు కంచె తగిలి ఒక ఎద్దు కుప్పకూలి మృతిచెందింది. దీంతో బండి అదుపు తప్పి బాలుడు నేరుగా విద్యుత్తు తీగలపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ఎండ్లబండి వెంబడి చంద్రకాంత్‌ తండ్రి గంగాధర్‌ సైతం నడిచి వెళుతున్నారు. కళ్ల ఎదుటే విగతజీవిగా మారిన కొడుకునుచూసి తండ్రి గుండె ఆగినంతపనైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని