Crime News: హాస్టల్లో మహిళల స్నానం వీడియోలు లీక్‌

మదురైలో వసతి గృహంలో ఉన్న మహిళలు స్నానం చేసే ఫొటోలు, వీడియోలు తీసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... రామనాథపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన కాళేశ్వరి అనే 31 ఏళ్ల మహిళ

Published : 26 Sep 2022 09:12 IST

మహిళ, మరో వ్యక్తి అరెస్టు

వేలచ్చేరి, న్యూస్‌టుడే: మదురైలో వసతి గృహంలో ఉన్న మహిళలు స్నానం చేసే ఫొటోలు, వీడియోలు తీసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... రామనాథపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన కాళేశ్వరి అనే 31 ఏళ్ల మహిళ మదురైలోని ఓ ప్రైవేటు లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ బీఈడీ చదువుతోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన వైద్యుడు ఆసిక్‌తో పరిచయం ఏర్పడింది. కాళేశ్వరి తాను ఉంటున్న హాస్టల్లోని మహిళలు స్నానాలు చేసే వీడియోలు, ఫొటోలను తీసి వాట్సప్‌లో ఆసిక్‌కు పంపుతూ వచ్చింది. రెండు రోజుల క్రితం ఆమెతో పాటు గదిలో ఉంటున్న మరో మహిళ ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో ఫొటోలు, వీడియోలు కనిపించాయి. నిశ్చేష్టురాలైన ఆమె విషయాన్ని వార్డెన్‌కు చెప్పింది. వార్డెన్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి ఆసిక్‌ను, కాళేశ్వరిని ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts