కన్వేయర్‌ బెల్టు పడి ఇద్దరు కూలీల దుర్మరణం

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల, కలువటాల గ్రామాల మధ్య నిర్మిస్తున్న రామ్‌కో సిమెంట్‌ కర్మాగారంలో కన్వేయర్‌ బెల్టు (సిమెంట్‌ సంచులను తీసుకెళ్లే బెల్టు) పడి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. పశ్చిమ

Published : 26 Sep 2022 04:49 IST

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల, కలువటాల గ్రామాల మధ్య నిర్మిస్తున్న రామ్‌కో సిమెంట్‌ కర్మాగారంలో కన్వేయర్‌ బెల్టు (సిమెంట్‌ సంచులను తీసుకెళ్లే బెల్టు) పడి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా గ్రామానికి చెందిన రహీం (27), మేదినిపూర్‌ గ్రామ నివాసి సుమన్‌ (22) పరిశ్రమలో కూలీ పనులు చేస్తూ ఇక్కడ నివసిస్తున్నారు. కర్మాగారంలో ఆదివారం కన్వేయర్‌ బెల్టుకు ఒకవైపు ఆరుగురు, మరోవైపు ఇద్దరు వెల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా ఇద్దరున్న వైపు కన్వేయర్‌ పడిపోయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. రహీంకు భార్య, పిల్లలున్నారు, సంఘటన జరిగిన రామ్‌కో సిమెంట్‌ కర్మాగారాన్ని ఈ నెల 28న సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని