యువతిపై ప్రేమోన్మాది దాడి

ప్రేమను అంగీకరించలేదని యువతిపై ఓ యవకుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో జరిగింది. ఓయూ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.

Published : 26 Sep 2022 05:05 IST

 పరారీలో నిందితుడు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ప్రేమను అంగీకరించలేదని యువతిపై ఓ యవకుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో జరిగింది. ఓయూ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌ భోలక్‌పూర్‌ బస్తీకి చెందిన యువతి(18) ఓ ప్రైవేటు మెడికల్‌ దుకాణంలో పనిచేస్తున్నారు. అదే బస్తీకి చెందిన రంజిత్‌(18) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని చెప్పి యువతిని ఓయూలోని మానేరు వసతిగృహం వద్దకు శనివారం రాత్రి ఏడుగంటల సమయంలో తీసుకొచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో రంజిత్‌ ఆమెపై దాడి చేశాడు. చేతికి తీవ్రంగా గాయమైన ఆమె గట్టిగా అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు, పోలీసులు యువతిని కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యువతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని