దుస్తులు విప్పించి బాలికను నుంచోబెట్టిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

మురికి దుస్తులు వేసుకుని పాఠశాలకు వచ్చిందని పదేళ్ల గిరిజన బాలికను తోటి విద్యార్థుల ముందే నుంచోబెట్టి అవమానించిన ఉపాధ్యాయుడిని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్‌ చేసింది.

Published : 26 Sep 2022 05:05 IST

శహడోల్‌: మురికి దుస్తులు వేసుకుని పాఠశాలకు వచ్చిందని పదేళ్ల గిరిజన బాలికను తోటి విద్యార్థుల ముందే నుంచోబెట్టి అవమానించిన ఉపాధ్యాయుడిని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. శహడోల్‌ జిల్లా బారాకాలా గ్రామంలోని జైసింగ్‌ నగర్‌ ప్రభుత్వ పాఠశాలకు శుక్రవారం అయిదవ తరగతి చదువుతున్న బాలిక వచ్చింది. ఆమె దుస్తులు మురికిగా ఉన్నాయని అభ్యంతరం తెలిపిన శ్రావణ్‌ కుమార్‌ త్రిపాఠి అనే ఉపాధ్యాయుడు... ఆ దుస్తులు విప్పించి స్వయంగా ఉతికాడు. అవి ఆరిపోయేంత వరకూ దాదాపు రెండు గంటల సమయం పాటు ఆమె లోదుస్తులతో నిరీక్షించాల్సి వచ్చింది. తాను బాలిక దుస్తులు ఉతకడాన్ని స్వచ్ఛమిత్రగా అభివర్ణించుకుంటూ విద్యాశాఖకు చెందిన వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించినట్లు గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆనంద్‌రాయ్‌ సిన్హా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని