ఉద్యోగం మానేయకుంటే యాసిడ్‌ పోస్తా!

సచివాలయ వార్డు అడ్మిన్‌ వేధింపులు తాళలేక ఓ మహిళా వాలంటీరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన ప్రకారం...

Published : 27 Sep 2022 04:07 IST

వార్డు అడ్మిన్‌ వేధింపులు తాళలేక మహిళా వాలంటీర్‌ ఆత్మహత్యాయత్నం

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: సచివాలయ వార్డు అడ్మిన్‌ వేధింపులు తాళలేక ఓ మహిళా వాలంటీరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన ప్రకారం... పట్టణానికి చెందిన ఓ వివాహిత 11వ వార్డులో వాలంటీరుగా పని చేస్తున్నారు. అదే వార్డు సచివాలయానికి అడ్మిన్‌గా ఉన్న ఎన్‌.వీరనాగబాబు రెండు నెలలుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇతర వాలంటీర్ల పని కూడా చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. సమస్యను ఆమె మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కక్ష పెంచుకున్న వీరనాగబాబు ఉద్యోగం మానేయాలంటూ ఆమెని వేధించడం ప్రారంభించాడు. లేదంటే ముఖంపై యాసిడ్‌ పోస్తానని, కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేసి, కేసు పెడతానని బెదిరిస్తున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని