క్షుద్రవిద్యలు చేశారని.. మలమూత్రాలు తాగించారు

చంద్రయానాల కాలంలోనూ ఇంకా అక్కడక్కడా మూఢ నమ్మకాలు ప్రజల మనసుల నుంచి తొలగడం లేదు. ఝూర్ఖండ్‌ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో తాజా దారుణం వెలుగుచూసింది.

Published : 27 Sep 2022 04:53 IST

రాంచీ: చంద్రయానాల కాలంలోనూ ఇంకా అక్కడక్కడా మూఢ నమ్మకాలు ప్రజల మనసుల నుంచి తొలగడం లేదు. ఝూర్ఖండ్‌ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో తాజా దారుణం వెలుగుచూసింది. క్షుద్రవిద్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబానికి చెందిన నలుగురు మహిళల చేత కొందరు గ్రామస్థులు బలవంతంగా మలమూత్రాలు తాగించారు. సరయ్యహాట్‌ పోలీస్‌స్టేషను పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts