బాలికపై లైంగిక వేధింపుల కేసులో 8 మందికి జీవిత ఖైదు

ఒక బాలిక (15)ను లైంగికంగా వేధించడంతోపాటు వ్యభిచారం చేయించిన కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు, మరో 13 మందికి 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది.

Published : 27 Sep 2022 05:36 IST

మరో 13 మందికి 20ఏళ్ల జైలు శిక్ష

చెన్నై, న్యూస్‌టుడే: ఒక బాలిక (15)ను లైంగికంగా వేధించడంతోపాటు వ్యభిచారం చేయించిన కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు, మరో 13 మందికి 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. చెన్నైలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి 26 మందిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 21 మందిని గతేడాది నవంబరు 21న అరెస్టు చేశారు. ఒకరు మృతి చెందగా.. ఇద్దరు మహిళలు సహా నలుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసు విచారణ పోక్సో ప్రత్యేక కోర్టులో కొనసాగింది. వాదనలు పూర్తవడంతో 21 మందిని దోషులుగా ప్రకటించి తీర్పు రిజర్వులో ఉంచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి రాజ్యలక్ష్మి సోమవారం తీర్పునిచ్చారు. బాలిక బంధువైన మహిళ తదితరులు ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించారు. పోలీసు ఇన్‌స్పెక్టరు పుగళేంది, భాజపా నేత రాజేంద్రన్‌, పౌరసరఫరాల శాఖ అధికారి కణ్ణన్‌, అనిత, కామేశ్వరరావు, మొహ్మద్‌ అజారుద్దీన్‌, బసులుద్దీన్‌, వినోబాజీ, రాజసుందర్‌, నాగరాజ్‌, పొన్‌రాజ్‌, వెంకట్రామ్‌ తదితరులు 13 మందికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని